ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా స్పెషలిస్ట్ గ్రేడ్-2 (సీనియర్ మరియు జూనియర్ స్కేల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 558 ఖాళీలు భర్తీ చేస్తారు. ఇందులో స్పెషలిస్ట్ గ్రేడ్-2 (సీనియర్ స్కేల్)కి 155 పోస్టులు, స్పెషలిస్టు గ్రేడ్-2 (జూనియర్ స్కేల్)కి 403 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్, ఎంఢీ, డీఎం, ఎంసీహెచ్, డీఏ, ఎంఎస్సీ, పీహెచ్డీ, డీపీఎం వంటి పీజీ అర్హతలు కలిగి ఉండాలి. సీనియర్ స్కేల్ పోస్టులకు కనీసం 5 సంవత్సరాల అనుభవం, జూనియర్ స్కేల్ పోస్టులకు డిగ్రీ హోల్డర్లకు 3 సంవత్సరాలు మరియు డిప్లోమా హోల్డర్లకు 5 సంవత్సరాల అనుభవం అవసరం. అభ్యర్థుల వయస్సు 2025 మే 26 నాటికి 45 ఏళ్లు మించకూడదు.
సీనియర్ స్కేల్ స్పెషలిస్టులకు నెలకు రూ.78,800, జూనియర్ స్కేల్ పోస్టులకు రూ.67,700 వరకు జీతం లభిస్తుంది. జీతంతో పాటు డీఎ, ఎన్పీఏ, హెచ్ఆరఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వంటి ఇతర ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది. అభ్యర్థులు సంబంధిత ప్రాంతానికి అనుగుణంగా రూ.500 డిమాండ్ డ్రాఫ్ట్/బ్యాంకర్స్ చెక్‌ను “ESI Fund Account No. II” పేరిట తీసి, అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో కలిసి, అభ్యర్థి ఎంపిక చేసిన రీజియన్‌కి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, PwBD, ESIC ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఇంటర్వ్యూపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలి.
దరఖాస్తు చేయడానికి చివరి గడువు మే 26. నోటిఫికేషన్లో పేర్కొన్న ఫార్మాట్ ప్రకారం అప్లికేషన్ ఫారాన్ని నింపి పంపాలి.