టెట్ ఉత్తీర్ణత శాతం గణనీయంగా పడిపోయింది. దాదాపు 3 లక్షల మంది ఫెయిలయ్యారు. జిల్లాల వారీగా ఉత్తీర్ణత శాతం వివరాలను టెట్ అధికారులు విడుదల చేశారు. దీని ప్రకారం జిల్లాల వారీగా అభ్యర్థులు క్వాలిఫైడ్ పర్సంటేజీ చూస్తే.. పేపర్–1లో అత్యధికంగా 46.15 శాతం జోగులాంబ గద్వాల, అత్యల్పంగా 29.90 శాతంతో వరంగల్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. జిల్లాల వారీగా పూర్తి వివరాలు, పేపర్ 2 వివరాల జాబితా కూడా ఇక్కడ (పోస్ట్ చివరన) అందుబాటులో ఉంది. టెట్ నోటిఫికేషన్ ప్రకారం 150 మార్కులకు గాను ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40శాతం, బీసీలకు 50శాతం, ఓసీలకు 60 శాతం మార్కులు రావాలి. క్వాలిఫై అయిన వారీ పర్సంటేజీ తగ్గడంతో వచ్చే ఉపాధ్యాయ నియామకాలకు పోటీ తగ్గనుంది.




Sc
9490042275