ఫ్రెంచ్, జర్మన్ లాంటి ఫారెన్ లాంగ్వేజ్‌లో నాలుగు నెలల జూనియర్, సీనియర్ డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సుల్లో 2024–2025 సంవత్సరం అడ్మిషన్స్‌కు అర్హులైన అభ్యర్థుల నుంచి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ ఉస్మానియా యూనివర్సిటీ అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హతలు: జూనియర్ డిప్లొమా కోర్సులకు ఇంటర్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సీనియర్ డిప్లొమాలో అర్హతకు 50 శాతం మార్కులతో జూనియర్ డిప్లొమా పాసై ఉండాలి లేదా డిగ్రీలో సంబంధిత సబ్జెక్టు చదివి ఉండాలి. అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులో అడ్మిషన్స్‌కు 50 శాతం మార్కులతో సీనియర్ డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జులై 6 వరకు అప్లై చేసుకోవాలి. జులై 8 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. పూర్తి సమాచారం కోసం 8331041309 ఫోన్ నంబర్‌కు సంప్రదించాలి. వివరాల కోసం www.diploma.osmaniaerp.com లో చెక్ చేసుకోవాలి.
