నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ), ఝార్ఖండ్‌లోని కోల్ మైనింగ్ హెడ్‌క్వార్టర్స్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మైనింగ్ ఓవర్‌మెన్, మైనింగ్ సిర్దార్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. మొత్తం 177 ఖాళీలున్నాయి.
మైనింగ్ ఓవర్‌మెన్: 74
అర్హత: మైనింగ్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. డీజీఎంఎస్ జారీ చేసిన ఓవర్‌మెన్ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 57 ఏళ్లు మించరాదు.
సాలరీ: నెలకి రూ.50,000 చెల్లిస్తారు.
మైనింగ్ సిర్దార్: 103
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. డీజీఎంఎస్ జారీ చేసిన వాలిడ్ సిర్దార్ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 57 ఏళ్లు మించకుండా ఉండాలి.
సాలరీ: నెలకి రూ.40,000 చెల్లిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: ఈ పరీక్ష 100 మార్కులకి నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని స్కిల్ టెస్ట్‌కి పిలుస్తారు. రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.03.2022.
వెబ్సైట్: www.careers.ntpc.co.in
ఎన్‌టీపీసీలో 177 కాంట్రాక్ట్ జాబ్స్
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS