Homeవార్తలుటీచర్​ పోస్టుల భర్తీ ఎప్పుడు.. పూర్తి వివరాలు..

టీచర్​ పోస్టుల భర్తీ ఎప్పుడు.. పూర్తి వివరాలు..

తెలంగాణలో అయిదేళ్లుగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తారని లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులను జిల్లాలకు సర్దుబాటు చేసే ప్రక్రియ ముగిసింది. ఖాళీ పోస్టుల విషయంలో ఒక స్పష్టత కూడా వచ్చింది. దీంతో ప్రభుత్వం ఇకనైనా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)పై, టీచర్‌ పోస్టుల భర్తీపై స్పష్టత ఇవ్వాలనే డిమాండ్లు అంతటా వినిపిస్తున్నాయి.

Advertisement

గత ఐదేళ్లుగా టీచర్‌ పోస్టుల భర్తీ చేపట్టకపోవడంతో ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్‌ నోటిఫికేషన్‌, ప్రతి రెండేళ్లకో సారి డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసేవారు. తెలంగాణ ఏర్పడ్డాక పరిస్థితి మారిపోయింది. ఒకే ఒక్కసారి 2017లో టీచర్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేశారు. అప్పటివరకు ఉన్న డీఎస్సీ పేరును టీఆర్‌టీగా మార్చి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఈ నియమకాలు చేపట్టారు. అప్పట్లో మొత్తం 25వేల టీచర్‌ పోస్టుల ఖాళీలు ఉంటే ప్రభుత్వం 13,500 పోస్టులకు మాత్రమే ఆమోదం తెలిపింది. చివరికి 8792 ఖాళీల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్‌ జారీ చేశారు. దశల వారీగా వీటిని భర్తీ చేస్తున్నారు. ఆ తరువాత మళ్లీ నోటిఫికేషన్‌ రాలేదు. రాష్ట్రంలో ప్రతి ఏటా 12,500 మంది డీఎడ్‌ కోర్సును, మరో 15 వేల మంది బీఎడ్‌ కోర్సును పూర్తి చేస్తున్నారు.

ప్రస్తుతం మొత్తం 1.75 లక్షల మంది డీఎడ్‌, 3 లక్షల మందికి పైగా బీఎడ్‌ పూర్తిచేసిన వారు ఉన్నట్లు అంచనా. టెట్‌లో అర్హత సాధించినవారు పేపర్‌-1లో 65 వేల మంది, పేపర్‌-2లో 1.5 లక్షల మంది ఉన్నారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం గత ఐదేళ్లుగా టెట్‌ నిర్వహించడం లేదు. తొలి టెట్‌ను 2016 మే 22న, రెండో టెట్‌ను 2017 జూలై 23న నిర్వహించారు. ఆ తరువాత మళ్లీ టెట్‌ ఊసే లేకపోవడంతో డీఎడ్‌, బీఎడ్‌ పూర్తి చేసినవారికి అన్యాయం జరుగుతోంది. ప్రస్తుతం టెట్‌కు జీవితకాలపరిమితి ఇచ్చినా.. నూతన అభ్యర్థులతోపాటు, గతంలో టెట్‌లో అర్హత సాధించనివారు లక్షల్లో ఉన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యా బోధన చేయాలన్నా టెట్‌ అర్హత తప్పనిసరి కావడంతో అభ్యర్థులంతా టెట్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

తెలంగాణ ఏర్పడ్డాక దాదాపు 5 లక్షల మంది బీఎడ్‌, డీఎడ్‌ పూర్తి చేసిన అభ్యర్థులున్నారు. వీరందరూ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మాత్రం టీఆర్‌టీపై రెండేళ్లుగా ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉంది. ఇటీవలి టీచర్ల బదిలీలతో అన్ని అవరోధాలు తొలిగిపోయాయి. బదిలీల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 వేల మంది ఉపాధ్యాయులు కొత్త జిల్లాలకు వెళ్లనున్నారు. మిగిలినవారు ఇప్పటివరకు పనిచేసిన స్థానాల్లో కొనసాగనున్నారు. అంటే.. గతంలో ఉన్న ఖాళీలు అలాగే ఉండిపోనున్నాయి. కొత్తగా ఉపాధ్యాయులను కేటాయించిన జిల్లాల్లో కొన్ని ఖాళీలు తగ్గిపోనుండగా, ఏ జిల్లాల నుంచి టీచర్లను కేటాయించారో.. అక్కడ కొత్త ఖాళీలు ఏర్పడ్డాయి.

Advertisement

ప్రస్తుతం ఒక జిల్లాలో ఉద్యోగం చేస్తూ మరో జిల్లాకు బదిలీ అయిన వారిలో ఎక్కువ మంది 2017 టీఆర్‌టీ, 2012 డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందినవారే ఉన్నారు. తాజాగా ఏర్పడ్డ ఖాళీలను కొత్త టీఆర్‌టీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. కొత్త రిక్రూట్మెంట్ చేపడితే మారిన నిబంధనల ప్రకారం 95 శాతం లోకల్ జిల్లా కోటాలో స్థానిక అభ్యర్థులకు ఎక్కువ పోస్టులు దక్కుతాయి. మిగతా 5 శాతం నాన్‌ లోకల్‌ కోటాలో భర్తీ చేస్తారు. 2017 టీఆర్‌టీ ద్వారా సింగిల్‌ టీచర్‌గా భర్తీ అయిన చాలా పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను ప్రస్తుతం వేరే జిల్లాలకు కేటాయించారు. ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేయాల్సి ఉంది.

RECENT POSTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

REASONING

DAILY TESTS

CURRENT AFFAIRS

రివిజన్ నోట్స్

హైదరాబాద్ లో భారీ జాబ్ మేళా.. 100 కంపెనీల్లో 10 వేల జాబ్స్.. వెంటనే రిజిస్టర్ చేసుకోండిలా..

హైదరాబాద్ లోని నిరుద్యోగులకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఏప్రిల్ 2న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ జాబ్ మేళా ద్వారా 100 కంపెనీల్లో...

తెలంగాణ పాటలు‌‌ రచయితలు: రివిజన్​ నోట్స్ 5

పల్లెటూరి పిల్లగాడపసులకాడి మొనగాడపాలుమరచి ఎన్నాళ్లయిందోఓ…. పాలబుగ్గల జీతగాడా!!!సుద్దాల హన్మంతుబండెనక బండి గట్టి - పదహారెడ్లబండికట్టిబండి యాదగిరి:రాజిగ - ఓ రాజిగ పుడితె ఒకడుచస్తే రెండుఊరు మనదిరా వాడమనదిరాగూడ అంజన్న. ఇద్దరం విడిపోతే భూమిబద్దలవుతుందా…'పల్లె...

తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్​ నోట్స్ 4

ఉద్యమం నాటి పుస్తకాలు - రచయితలు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్​ ప్రొఫెసర్​ జయశంకర్​తెలంగాణలో ఏం జరుగుతోందిప్రొఫెసర్​ జయశంకర్​'ఎ రిబట్టర్ టు విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగండ' కొణతం దిలిప్ తెలంగాణ విద్యతెలంగాణ విద్యావంతుల...

నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు… తెలంగాణ రివిజన్​ నోట్స్ 3

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 2

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 1

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

భక్తి.. సూఫీ ఉద్యమాలు

భక్తి, సూఫీ ఉద్యమాల నుంచి అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే అభ్యర్థుల ప్రిపరేషన్​కు ఉపయోగపడే విధంగా రన్నింగ్​ నోట్స్​ ఇక్కడ అందిస్తున్నం.శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యలను త్రిమతాచార్యులు అంటారు. వీరి రాకతో...

భారత దేశ సరిహద్దులు.. సంబంధాలు

పోటీ పరీక్షల్లో ఇండియన్​ జాగ్రఫీ కీలకం. అందులో భారత ఉనికి.. స్వరూపం నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశముంటుంది. సరిహద్దులు.. ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలు, వివాదాలపై తప్పనిసరి ప్రశ్నలు అడిగే...

తెలంగాణ ప్రభుత్వ పథకాలు

తెలంగాణకు హరితహారం: రాష్ట్రంలో ఉన్న అటవీ విస్తీర్ణంలో 24 శాతం నుంచి 33శాతానికి పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన కార్యక్రమం ‘కోతులు వాపస్​ పోవాలి వానలు వాపస్​ రావాలె’ అనే నినాదంతో 2015 జులై...

భారతదేశంలో బ్రిటీష్ గవర్నర్​ జనరల్స్​

వారన్​ హేస్టింగ్స్​ 1772 నుంచి 1774 వరకు బెంగాల్​ చివరి గవర్నర్ గా పనిచేశారు. 1774 నుంచి ఈస్ట్​ ఇండియా కంపెనీటి మొదటి గవర్నర్​ జనరల్​ లేదా తొలి గవర్నర్​ జనరల్​...

తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు

1983 తెలంగాణ డెమోక్రటిక్​ ఫ్రంట్​ సత్యనారాయణ1985 ఫిబ్రవరి 27 తెలంగాణ జనసభ దుశ్చర్ల సత్యనారాయణ1987 తెలంగాణ ప్రజా సమితి భూపతి కృష్ణమూర్తి1989 తెలంగాణ పోరాట సమితి కె.ఆర్.​ ఆమోస్​, మేచినేని కిషన్​రావు1990 తెలంగాణ...

INDIAN CONSTITUTION

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!