Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSమరో వేయికి పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తుకు 8 రోజులే ఛాన్స్.. ఇలా అప్లై...

మరో వేయికి పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తుకు 8 రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1284 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయునన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. ఇందులో 1220 పురుషులకు , 64 మహిళలకు కేటాయించారు. కోబ్లర్, టైలర్, వాషర్‌మన్, బార్బర్, స్వీపర్, కుక్‌, వెయిటర్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు:
టెన్త్ పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థి వయస్సు 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు https://rectt.bsf.gov.in/ వెబ్ సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ఎంపిక ఇలా..
అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం ఉంటుంది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!