HomeLATESTగ్రూప్-2 పరీక్ష వాయిదాపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన!

గ్రూప్-2 పరీక్ష వాయిదాపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన!

తెలంగాణలో ఆగస్టు 29, 30 తేదీల్లో జరగాల్సి ఉన్న గ్రూప్-2 (TSPSC Group-2) పరీక్షలను వాయిదా వేయాలని చాలా రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం అసెంబ్లీ వరకు వెళ్లింది. చాలా మంది ఎమ్మెల్యేలు గ్రూప్-2 ఎగ్జామ్ ను వాయిదా వేయాలని కోరడంతో సీఎం కేసీఆర్ (CM KCR) ఈ విషయంపై స్పందించారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసే అవకాశం లేదని సీఎం ప్రకటించారు. గ్రూప్-2 పరీక్ష షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీఎస్ శాంతికుమారితో చర్చించిన తర్వాత సీఎం ఈ ప్రకటన చేశారు.అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా ఇతర పరీక్షల నిర్వహనపై మరో సారి అధికారులతో చర్చించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు.

వరుసగా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నియామక పరీక్షలు ఉండడంతో గ్రూప్-2 వాయిదా వేసే అవకాశం లేదని ప్రభుత్వానికి టీఎస్పీఎస్సీ నుంచి సమచారం అందినట్లు తెలుస్తోంది. ఒక వేళ వాయిదా వేస్తే ఎన్నికల తర్వాతనే గ్రూప్-2 నిర్వహించాల్సి వస్తుందని చెప్పినట్లు ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర స్థాయిలో గ్రూప్-1 తర్వాత అత్యంత ముఖ్యమైన గ్రూప్-2 ఎగ్జామ్ ను వాయిదా వేయడం సరికాదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే గతేడాది డిసెంబర్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. మొత్తం 5.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!