ప్లాస్టిక్ ఇంజనీరింగ్ డిప్లోమా, పీజీ డిప్లొమా కోర్సుల అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) ద్వారా అడ్మిషన్లు చేపుడుతారు. 2022 సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న సీపెట్ కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లో ఈ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
కోర్సులు
డిప్లొమా-ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ (DPMT): కోర్సు డ్యురేషన్ మూడేళ్లు మొత్తం 6 సెమిస్టర్లు ఉంటాయి. వయసుతో సంబంధం లేదు. పదో తరగతి/ ఇంటర్/ ఐటీఐలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు. (చివరి పరీక్షకు హాజరై ఫలితాల కోసం చూస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు).
డిప్లొమా-ప్లాస్టిక్స్ టెక్నాలజీ (DPT): కోర్సు డ్యురేషన్ మూడేళ్లు ఇందులో మొత్తం 6 సెమిస్టర్లు ఉంటాయి. వయసుతో సంబంధం లేదు. పదో తరగతి/ ఇంటర్ / ఐటీఐలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. (చివరి పరీక్షకు హాజరై ఫలితాల కోసం చూస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు).
పోస్ట్ డిప్లొమా – ప్లాస్టిక్ మౌల్డ్ డిజైన్ విత్ క్యాడ్/ క్యామ్: కోర్సు ఏడాదిన్నర ఉంటుంది. ఇందులో మూడు సెమిస్టర్లు ఉంటాయి. వయసుతో సంబంధం లేదు. మెకానికల్/ ప్లాస్టిక్స్/ పాలిమర్/ టూల్/ ప్రొడక్షన్/ మెకట్రానిక్స్/ ఆటోమొబైల్/ టూల్&డై మేకింగ్/ పెట్రోకెమికల్స్/ ఇండస్ట్రియల్/ ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ సబ్జెక్టుల్లో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫైనల్ ఎగ్జామ్‌కు హాజరై ఫలితాల కోసం చూస్తున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా-ప్లాస్టిక్ ప్రాసెసింగ్ & టెస్టింగ్ (PGD-PPT): రెండేళ్లు కోర్సు డ్యురేషన్ ఉంటుంది. మొత్తం నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. వయసుతో సంబంధం లేదు. సైన్స్ సబ్జెక్టులతో మూడేళ్ల ఫుల్ టైం డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. చివరి పరీక్షకు హాజరై ఫలితాల కోసం చూస్తున్న వారు అప్లై చేసుకోవచ్చు.
ఖాళీలు: డిప్లొమా కోర్సులైన డీపీఎంటీ, డీపీటీ లో 60 సీట్ల చొప్పున 120, పీజీ డిప్లొమా కోర్సులైన పీజీడీ–పీపీటీ, పీడీ–పీఎండీ లో 90 సీట్ల చొప్పున 180 సీట్లు హైదరాబాద్ క్యాంపస్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులకు జూన్ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. ఎగ్జామ్ జూలైలో నిర్వహిస్తారు. ఆగస్టు నుంచి కోర్సులు ప్రారంభమవుతాయి. పూర్తి సమాచారం కోసం 8374064444 నంబర్‌కు కాల్ చేసి సంప్రదించాలి.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తులు జూన్ 5వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. సీపెట్ అడ్మిషన్ టెస్ట్ జూన్ 19న నిర్వహిస్తారు. కోర్సులు ఆగస్టు 16 నుంచి ప్రారంభం అవుతాయి.
జాబ్ అపర్చునిటీస్
సీపెట్ లోని ప్లాస్టిక్ డిప్లొమా కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో బోలెడన్ని అవకాశాలున్నాయి. ప్లాస్టిక్ తయారీ సంస్థల్లోనే కాకుండా ఫార్మా, ఇరిగేషన్, మెడికల్, ప్యాకేజింగ్, ఫుడ్ ఇండస్ట్రి ఇలా ప్లాస్టిక్ వినియోగించే ప్రతి పరిశ్రమలో ప్లాస్టిక్ కోర్సులు చేసినవారి అవసరం ఉంది. బీఎస్సీ అర్హతతో ప్లాస్టిక్ ప్రాసెసింగ్, టెస్టింగ్‌లో పీజీ డిప్లొమా చేసినవారికి సూపర్‌వైజర్లుగా తీసుకుంటున్నాయి. సీఏడీ, సీఏఎంలో పీజీ చేసినవారిని మౌల్డ్ డిజైనర్లుగా వేలల్లో జీతం దొరుకుతోంది. కేవలం టెన్త్‌తోనే డిప్లొమా చేసినవారికి అసిస్టెంట్ ఇన్‌ఛార్జి, షిఫ్ట్ ఇన్‌ఛార్జిగా అవకాశాలు లభిస్తున్నాయి. సీపెట్‌లో కోర్సులు పూర్తిచేసినవారిలో 80శాతం మందికి ప్లేస్‌మెంట్స్‌కు దక్కుతున్నాయి. మిగతా 20శాతం విద్యార్థులు హయ్యర్ స్టడీస్‌కు వెళ్తున్నారు. ఇవన్నీ కాకుండా సొంతంగా కూడా ప్లాస్టిక్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చు. వారికి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణాలు ఇస్తున్నాయి.
వెబ్సైట్: www.eadmission.cipet.gov.in
