HomeLATESTఐఐఐటీ హైదరాబాద్‌లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు నోటిఫికేషన్​

ఐఐఐటీ హైదరాబాద్‌లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు నోటిఫికేషన్​


హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) 2022 విద్యాసంవత్సరానికి ఎంటెక్​, ఎమ్మెస్సీ, పీహెచ్​డీ కోర్సుల్లో అడ్మిషన్స్​కు నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఏప్రిల్​ 3వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంటెక్‌): ఈ కోర్సు డ్యురేషన్​ రెండు సంవత్సరాలు ఉంటుంది. ఇందులో కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, కంప్యూటర్‌ ఎయిడెడ్‌ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్‌డిజైన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాలు ఉంటాయి. సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌ పూర్తి చేసినవారు ఈ కోర్సుకు అర్హులు.

మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎంఎస్‌): ఈ కోర్సుకు రెండేళ్ల కాలవ్యవధి ఉంటుంది. ఇందులో కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, సివిల్‌, బయోఇన్ఫర్మాటిక్స్‌ విభాగాలు ఉంటాయి. సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్/ ఎంటెక్​లో ఉత్తీర్ణత సాధించిన వారు ఇందుకు అర్హులు.

డాక్టర్‌ ఆఫ్‌ పిలాసఫీ (పీహెచ్‌డీ): ఈ కోర్సుకు డ్యురేషన్​ ఐదేళ్లు ఉంటుంది. ఇందులో కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, సివిల్‌, బయోఇన్ఫర్మాటిక్స్‌ విభాగాలు ఉంటాయి. సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్/ ఎంటెక్‌ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

సెలెక్షన్​ ప్రాసెస్​: ప్రవేశ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎగ్జామ్​ ఏప్రిల్​ 16వ తేదీన నిర్వహిస్తారు. అభ్యర్థులు దరఖాస్తులు ఆన్‌లైన్​లో ఏప్రిల్​ 3వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం https://pgadmissions.iiit.ac.in/pgee/ వెబ్​సైట్​ సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!