దేశంలో పరీక్షల సీజన్ మొదలైంది. వివిధ పరీక్షలకు సంబంధించి తేదీలు విడుదల అవుతున్నాయి. తాజాగా సీబీఎస్ఈ బోర్డు 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మొదలై మార్చి 21 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై ఏప్రిల్ 5వరకు జరుగుతాయని బోర్డు తెలిపింది. జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షలను పరిగణనలోకి తీసుకొని ఈ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలిపింది.
సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే!
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS