ఆంధ్రప్రదేల్ 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను అధికారులు కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా.. 4,58,219 మంది ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో కేవలం 95,208 మంది మాత్రమే ఫిజికల్ ఈవెంట్స్ కు అర్హత సాధించారు. వీరికి ఈవెంట్స్ నిర్వహించి.. అందులో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ నిర్వహించి తుది ఎంపిక చేపట్టనున్నారు. జనవరి 22న ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. https://slprb.ap.gov.in/ లింక్ ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
పోలీస్ ఉద్యోగ పరీక్ష ఫలితాలు విడుదల.. కేవలం ఎంత మంది క్వాలిఫై అయ్యారంటే?
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS