నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధి లోని నవోదయ విద్యాలయ సమితి 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఈ ప్రకటన జారీ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 649 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6 వ తరగతి అడ్మిషన్లకు ఎంట్రన్స్ నిర్వహిస్తుంది. ఏప్రియల్ 29 వ తేదీన ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో వచ్చే మెరిట్ మార్కుల ఆధారంగా అడ్మిషన్లు చేపడుతారు. ప్రస్తుతం అయిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. జనవరి 31 వ తేదీ లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు దాఖలు చేయాలి. పూర్తి వివరాలు నవోదయ సమితి వెబ్ సైట్ లో navodaya.gov.in అందుబాటులో ఉన్నాయి.
