నాగ్ పూర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తుల కోరుతోంది. 11 అడ్జంక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు తెలసుకుందాం.
పోస్టు వివరాలు
అడ్జంక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ : 11 పోస్టులు
విభాగాలు : కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
అర్హత:
సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతోపాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
జీతం:
పీహెచ్డీ చేసిన అభ్యర్థులకు నెలకు రూ. 65వేలు, పీజీ చేసిన అభ్యర్థులకు నెలకు రూ.60వేలు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ: దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. చివరి తేదీ 15-05-2024