తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వెబ్‌సైట్‌లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల వివరాలు సవరణ చేసుకునేందుకు ఈ రోజు(మార్చి 28) మధ్యాహ్నం 2గంటల నుంచి టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఐడి కలిగిన అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్‌తో పాటు కొత్త వారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేలా వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది.
- తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పది జిల్లాలు 33 జిల్లాలు పునర్విభజన చెందిన నేపథ్యంతో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు అభ్యర్థుల స్థానికతను సవరించుకోవచ్చు. 33 జిల్లాల్లో రెండు మల్టీ జోన్లు, ఏడు జోన్లు ఏర్పాటైనందున వాటి ప్రకారం అభ్యర్థల స్థానికతను ఖరారు చేసుకోవచ్చు. సుమారు 25 లక్షల మంది అభ్యర్థులు దీని ద్వారా స్థానికతలో మార్పులు చేసుకోనున్నారు.
- ముందుగా అభ్యర్థులు తమ స్థానికత వివరాలను సవరించుకోవాల్సి ఉంటుంది. టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ, 1-7వ తరగతి వరకు వివరాలు ప్రస్తుత 33 జిల్లాలకు అనుగుణంగా నమోదు చేయాలి. వీటితో పాటు గతంలో ఉన్న విద్యార్హతల్లో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని కూడా జత చేయవచ్చు.
- టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ ఓపెన్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి. తర్వాత మొబైల్ నంబరు ఎంట్రీ చేస్తే వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి.
- అప్లికేషన్ ఫారంలో వ్యక్తిగత సమాచారం, చిరునామా, ఈ-మెయిల్ ఐడీ, అభ్యర్థులు 1-7వ తరగతి వరకు చదివిన జిల్లాల వివరాలను, విద్యార్హతలను ఎంట్రీ చేయాలి.
- తర్వాత అభ్యర్థి ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. ఈ వివరాలన్నీ సబ్మిట్ చేసిన తరవాత టీఎస్‌పీఎస్సీ ఐడీ జనరేట్ అవుతుంది. దానిని డౌన్లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి.
- ఓటీఆర్ ఎడిట్ చేసుకోవాలంటే వెబ్‌సైట్‌లో ఎడిట్ ఓటీఆర్‌పై క్లిక్ చేసి టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి. తరువాత ఫోన్ నంబరు ఎంట్రీ చేస్తే ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేయాలి.
- తర్వాత ఎడిట్ చేయాల్సిన వివరాలు కరెక్ట్‌గా నమోదు చేసి అభ్యర్థులు 1-7వ తరగతి వరకు చదివిన జిల్లాలను ఎంపిక చేసుకుని విద్యార్హతలను నమోదు చేయాలి. తర్వాత అభ్యర్థి ఫొటో, సంతకం అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేస్తే కొత్త ఓటీఆర్ జనరేట్ అవుతుంది.