తెలంగాణ ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వచ్చే వారం నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 2022-23 అడ్మిషన్లకు తెలంగాణా ఇంజనీరింగ్,అగ్రికల్చర్,మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TSEAMCET-2022) నోటిఫికేషన్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు, ఇంటర్ పూర్తయిన అభ్యర్థులు ఎంసెట్ రాసేందుకు అర్హులే. ఆసక్తి ఉన్న వారందరూ ఆన్ లైన్ లో ఏప్రిల్ 6 వ తేదీ నుంచి మే 28 వ తేదీ లోగా అప్లికేషన్లు నమోదు చేసుకోవాలి. అగ్రికల్చర్ స్ట్రీం ఎంట్రన్స్ జులై 14,15 తేదీల్లో,ఇంజనీరింగ్ స్ట్రీం ఎంట్రన్స్ జూలై 18,19,20 తేదీల్లో జరగనుంది.
అప్లై చేసుకోవాల్సిన వెబ్సైట్; https://eamcet.tsche.ac.in/
ఈసెట్-2022 (TSECET 2022) నోటిఫికేషన్ రిలీజైంది. ఏప్రిల్ 6 వ తేదీ నుంచి జూన్ 8 వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లై చేసుకోవాలి. జూలై 13 వ తేదీన ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
https://ecet.tsche.ac.in/


