తెలంగాణ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఇటీవలే గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్ఈ తాజాగా జీఆర్ఎల్ జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ర్యాంకును తెలుసుకునేందుకు వీలుగా జీఆర్ఎల్ జాబితాను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రెండు అనెక్జర్ లుగా టీజీపీఎస్సీ ఈ ఫలితాలను పీడీఎఫ్ రూపంలో వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది.
మొదటి అనెక్షర్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులను వెల్లడించింది. అనుమానాలు, అపోహలకు తావు లేకుండా అభ్యర్థులకు గ్రూప్ 1 మెయిన్స్ లో క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లిష్‌లో వచ్చిన మార్కులను, మిగతా ఆరు పరీక్షల్లో వచ్చిన మార్కులను విడివిడిగా వెల్లడించింది. దీంతో అభ్యర్థులందరూ వారికి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో వచ్చిన మార్కులను తెలుసుకునే వీలుంది.
రెండో అనెక్షర్లో అభ్యర్థుల ర్యాంకులను ప్రకటించింది. వరుసగా ఒకటో ర్యాంక్ నుంచి 12622 ర్యాంకు వరకు ర్యాంకుల జాబితాను అభ్యర్థుల హాల్ టికెట్ల నెంబర్, కమ్యూనిటీ, జోన్లు, ప్రత్యేక కోటా వివరాలన్నీ వెల్లడించింది. దీంతో అభ్యర్థులు ఏ జోన్ లో ఏ పోస్టు తమకు వచ్చే అవకాశముందో అంచనాకు వచ్చే వీలుంది.
ప్రొవిజనల్ మార్కులు: మొత్తం 7 పేపర్లకు హాజరైన అభ్యర్థుల మార్కులు మార్చి 10 నుంచి మార్చి 16 వరకు అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లలో అందుబాటులో ఉన్నాయి.
మార్కుల రీకౌంటింగ్: 10/03/2025 నుండి 24/03/2025 వరకు అభ్యర్థులకు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
మార్కులు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్
- టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 1 అభ్యర్థుల మార్కులు మరియు సాధారణ ర్యాంకింగ్ జాబితా (GRL) TSPSC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
- మార్కులు మార్చి 30 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.
- జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్చి 30 నుంచి ఏప్రిల్ 28 వరకు అందుబాటులో ఉంటుంది.
అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో TGPSC వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి మార్కులను చూడవచ్చు/డౌన్లోడ్ చేసుకోవచ్చు. జీఆర్ఎల్ ఆధారంగాసర్టిఫికేట్ ధృవీకరణకు ఎంపికైన అభ్యర్థులకు టీజీపీఎస్సీ వ్యక్తిగతంగా సమాచారం అందజేస్తుంది. హైకోర్టు ఆదేశాల మేరకు మెయిన్స్ పరీక్షలకు హాజరైన కొందరి అభ్యర్థుల మార్కులను వెల్లడించలేదని టీజీపీఎస్సీ వెబ్‌నోట్ లో ప్రకటించింది.
నోటిఫికేషన్‌లో సూచించినట్లుగా అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది.
ANNEXURE 1 (GROUP 1 MARKS)?
ANNEXURE 2 (GROUP 1 GRL) ?
మొత్తం 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు 2023 అక్టోబర్ 21 నుండి 27 వరకు నిర్వహించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 7 పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షల వాల్యుయేషన్ పూర్తిచేసిన అధికారులు, మార్కుల వివరాలను అభ్యర్థుల లాగిన్‌లలో ఇటీవలే అందుబాటులో ఉంచారు. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ ఐడీ, మెయిన్స్ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీతో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి పేపర్ల వారీగా తమ మార్కులు తెలుసుకునే వీలు కల్పించింది. ఇప్పుడు జీఆర్ఎల్ విడుదల చేయటంతో ఈ నియామక ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చింది.
