HomeLATESTసమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయంలో బీఏ అడ్మిషన్స్​

సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయంలో బీఏ అడ్మిషన్స్​

ములుగులోని సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి బీఏ కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ రిలీజ్​ అయింది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2024 ప్రవేశ పరీక్ష ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేయనున్నారు. అర్హులైన జనరల్‌, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగ అభ్యర్థులు అక్టోబర్‌ 3వ తేదీన నిర్వహించే స్పాట్‌ కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు.

బీఏ ఇంగ్లీష్ (ఆనర్స్): కనీసం 60% మార్కులతో ప్లస్‌ టూ (ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా), సీయూఈటీ-యూజీ 2024 ఉత్తీర్ణులై ఉండాలి.

బీఏ ఎకనామిక్స్‌ (ఆనర్స్): ఏదైనా స్ట్రీమ్‌లో కనీసం 60% మార్కులతో ప్లస్‌ టూ (ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా), సీయూఈటీ-యూజీ 2024 ఉత్తీర్ణులై ఉండాలి. మొత్తం 8 సెమిస్టర్లు ఉంటాయి. డ్యురేషన్​ నాలుగేళ్లు ఉంటుంది.

సెలెక్షన్​ ప్రాసెస్​: మొదటి ప్రాధాన్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే సీయూఈటీ-యూజీ 2024 స్కోరు, రెండో ప్రాధాన్యంగా ఇంటర్‌ విద్యార్హత ఆధారంగా సీటు కేటాయిస్తారు. అక్టోబర్​ 3న స్పాట్​ అడ్మిషన్​ ఉంటుంంది. అడ్రస్​ యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ భవనం), ట్రాన్సిట్ క్యాంపస్, జాకారం గ్రామం, ములుగు లో సంప్రదించాలి. పూర్తి వివరాలకు www.ssctu.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!