హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఏడాది (2024-–25) అప్రెంటిస్షిప్ శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ స్వీకరిస్తోంది.
ఖాళీలు: మొత్తం 200 ఖాళీల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 40, టెక్నీషియన్ అప్రెంటిస్ 40, ట్రేడ్ అప్రెంటిస్ 120 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్హతల్లో సాధించిన మార్కులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, కెమికల్, కమర్షియల్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. అప్రెంటిస్షిప్ ఏడాది ఉంటుంది.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.drdo.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.