దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 10వేలకు పైగా బోధన, బోధనేతర ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించినట్లు నెస్ట్స్ తెలిపింది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన నెస్ట్స్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టింది.
ఇది కూడా చదవండి: స్ట్రే వేకెన్సీ రౌండ్ ఫలితాలు రిలీజ్..ఇలా చెక్ చేసుకోండి..!!
ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం ప్రిన్సిపల్, పీజీటీ, జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు జులై 31వ తేదీతో దరఖాస్తు ముగిసింది. 6 వేలకు పైగా టీజీటీ హాస్టల్ వార్డెన్ పోస్టులకు కూడా దరఖాస్తు గడువు ముగిసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు తాజాగా దరఖాస్తు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, డిప్లొమా, పీజీ, డీఈడీ, బీఈడీ, సీటెట్ వంటి విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 19 లోపు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.
ఖాళీల వివరాలు :
■ టీజీటీ పోస్టులు: 5,660
■ హాస్టల్ వార్డెన్ (పురుషులు) పోస్టులు: 335
■ హాస్టల్ వార్డెన్ (మహిళలు) పోస్టులు: 334
■ ప్రిన్సిపల్ పోస్టులు: 303
■ పీజీటీ పోస్టులు: 2,266
■ అకౌంటెంట్ పోస్టులు: 361
■ జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ పోస్టులు: 759
■ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు: 373
Dear sir I am kviswanath my studying in diploma ECE and computer science computers teaching and non-technical I am job ready 10 years experience hostel wardens lab assistant jobs ready. Cell number..94900 77776 my whatsup