ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే వైద్యారోగ్య శాఖలో సుమారు 50వేలకు పైగా వైద్యులతోపాటు కొత్త నియామాకాలను పూర్తిచేశారు.అటు గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి ఎపీపీఎస్సీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహిస్తామన్నారు. ఇలా ఒక్కొక్క శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రక్రియ షురూ చేసిన సర్కార్…రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటఫికేషన్ రిలీజ్ చేస్తామని ప్రకటించింది.
ఇది కూడా చదవండి: ఏకలవ్య పాఠశాలల్లో 10,391 బోధన, బోధనేతర కొలువులు..!!
రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో 17ఏళ్లుగా నియామకాలు జరగడం లేదు. ఖాళీ అయిన పోస్టుల్లో కాంట్రాక్ట్ పద్దతిలో టీచింగ్ స్టాఫ్ ను భర్తీ చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్న 18 ప్రభుత్వ యూనివర్సిటీల్లో సుమారు 12లక్షల మంది చదువుతున్నారు. వీరికి నాణ్యమైన విద్యను అందించేందుకు ముందకెళ్తున్నట్లు ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొసెసర్ ఉద్యోగాలకు ఈనెల 20న నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 3,282 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్ చేసేందుకు సర్కార్ నోటిఫికేషన్ జారీ చేయనుంది.