HomeLATESTటెట్​ 40 డేస్​ ప్లాన్​.. 130 మార్కులు రావాలంటే..

టెట్​ 40 డేస్​ ప్లాన్​.. 130 మార్కులు రావాలంటే..

టీచర్​ ఎలిజిబులిటీ టెస్ట్​ ‘టెట్​’ (TSTET 2023) నోటిఫికేషన్​ విడుదలయింది. సెప్టెంబర్​ 15కు పరీక్ష ఉండటంతో అభ్యర్థులకు ప్రిపరేషన్​కు అటుఇటుగా 40 రోజులు మాత్రమే మిగులుతుంది. టెట్‌కు లైఫ్​టైమ్​ వ్యాలిడిటీ ఉండటంతో పాటు టెట్​ తర్వాత టీచర్​ పోస్టుల భర్తీ చేపట్టనుండటంతో ఈసారి ఎక్కువ మంది పరీక్ష రాసే అవకాశముంది. టెట్‌ కేవలం అర్హత పరీక్షే కాకుండా డీఎస్సీ/టీఆర్టీలో (DSC/TRT) 20 మార్కుల వెయిటేజీ కూడా ఉంటుంది. దీంతో టీచర్​ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలకు టెట్​ స్కోర్​ కీలకంగా మారనుంది. 2011 నుంచి 2017 వరకు జరిగిన టెట్​ పేపర్లను గమనిస్తే సబ్జెక్టుల వారిగా ప్రశ్నల స్థాయి ఎలా ఉంది?, ఏ అంశాల నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు? కొత్తగా చేర్చిన అంశాలు ఏవి? వేటిపై అభ్యర్థులు ఫోకస్​ పెట్టి చదవాలి? ఎలా చదివితే టెట్​లో టాప్​ స్కోర్​ సాధించవచ్చనే నిపుణులు సలహాలు, సూచనలు ఒకసారి చూద్దాం..

(TSTET 2023 డెయిలీ ప్రాక్టీస్​ టెస్ట్ లు merupulu.com అందిస్తుంది. Don’t miss to get good score)

  • చాలా మంది టెట్​ అంటే అర్హత సాధిస్తే చాలు మిగతా డీఎస్సీలో చదువుదాం అనే ఆలోచనతో నామమాత్రంగా చదువుతారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే డీఎస్సీకి టెట్​ అనేది సెమిఫైనల్​ లాంటిది. దాదాపు 80 శాతం సిలబస్​ టెట్​లో ఉన్నదే డీఎస్సీలో ఉంటుంది. కనుక అభ్యర్థులు టెట్​లో మంచి స్కోర్​ సాధిస్తే డీఎస్సీ ప్రిపరేషన్​ చాలా సులభం అవుతుంది.
  • కరెంట్​ అఫైర్స్​, జనరల్​ నాలెడ్జ్​, పర్స్​పెక్టివ్​ ఎడ్యుకేషన్​ మాత్రమే డీఎస్సీలో అదనంగా ఉంటాయి. మిగతా కంటెంట్​, ఇంగ్లీష్​, తెలుగు, మెథడాలజీ అంశాలు టెట్​, డీఎస్సీలో ఒకే విధమైన సిలబస్​ ఉంటుంది. కొంత ప్రశ్నల కాఠిన్యత పెరుగుతుంది అంతే. కాబట్టి అభ్యర్థులు టెట్‌లో గరిష్ట స్కోర్​ సాధించేందుకు కష్టపడాలి. 150 మార్కులకు గాను కనీసం 110 నుంచి 130 మార్కులు సాధిస్తే డిఎస్సీలో మంచి వెయిటేజి వస్తుంది. మీ ప్రిపరేషన్​ బాగుందని భావించవచ్చు.
  • టెట్​ నోటిఫికేషన్​ వెలువడుతుందన్న సమాచారం తెలియగానే చాలా మంది అభ్యర్థులు మార్కెట్​లో ఉన్న పుస్తకాలన్నింటినీ ఇంటికి తెచ్చుకుని ఏది చదవాలో తెలియని గందరగోళానికి గురవుతుంటారు. ముఖ్యంగా మొదటి సారి టెట్​ రాసే వారిలో ఇది ఎక్కువగా ఉంటుంది. అయితే అనవసర టెన్షన్​కు లోను కాకుండా తెలుగు అకాడమీ పుస్తకాలు, డీఈడీ, బీఈడీ సిలబస్​, రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించి పాఠ్యపుస్తకాలను ప్రామణికంగా చేసుకుని చదివితే మంచి స్కోర్​ సాధించవచ్చు. ప్రశ్నాపత్రం తయారు చేసే నిపుణులు ప్రామాణిక పుస్తకాలనే ఆధారంగా చేసుకుంటారని అభ్యర్థులు గమనించాలి.
  • కొత్త సిలబస్​, పాత సిలబస్​ ఏది చదవాలి అనే ఆందోళన సాధారణంగా అందరి అభ్యర్థుల్లో ఉంటుంది. అలాగే క్వశ్చన్​ పేపర్​ ఎలా ఉంటుంది? ఏదైనా మార్పులు, చేర్పులు ఉంటాయా? అనే ఆలోచన మొదలువుతుంది. అయితే ఈసారి దాదాపుగా పాత పద్ధతిలోనే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సవరించిన సిలబస్​తోనే పరీక్ష నిర్వహించేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నారు. అనవసర ఆందోళన పక్కన పెట్టి గతంలో టెట్​ సిలబస్​ షీట్​ను పక్కన పెట్టుకుని ప్రిపరేషన్​ ప్రారంభించడం ఉత్తమం.
  • ప్రిపరేషన్​ ప్రారంభంలోనే మోడల్​ పేపర్​ ప్రాక్టీస్​, బిట్​ బ్యాంక్​ ప్రాక్టీస్​ చేయడం లాంటివి కాకుండా సిలబస్​లోని అంశాల థియరీ పార్ట్​ను కచ్చితంగా చదవాలి. ఆగస్ట్​ నెలాఖరు వరకు ప్రిపరేషన్​, తర్వాత వారం రోజులు రివిజన్​కు, చివరి వారంలో ప్రాక్టీస్​ కోసం కేటాయించుకుని చదవాలి. కీలక పాఠ్యాంశాలపై పట్టు ఉంటే మిగిలిన విషయాలపై దృష్టి కేంద్రీకరించాలి. ఇది తర్వాత చదువుదాం, ఫలానా సబ్జెక్ట్​ ఈజీ అని తేలికగా తీసుకోవద్దు. ఇతరులతో పోల్చుకుని న్యూనత భావానికి లోను కావద్దు. నాకే అన్ని తెలుసు అనే భావనను విడిచిపెట్టి తెలియని విషయాలను సబ్జెక్టు నిపుణులు, తోటి విద్యార్థుల ద్వారా తెలుసుకుని చదవాలి.
  • చైల్డ్​ సైకాలజీ–పెడగాగి– ఈ సబ్జెక్ట్​ను అభ్యర్థులు డీఈడీ, బీఈడీ కోర్సులో భాగంగా చదివే ఉంటారు. దీని సిలబస్​ చాలా విస్తృతమైంది. కాన్సెప్ట్​లు అర్ధం చేసుకుని చదివితే కాని సరైన జవాబులను గుర్తించలేము. ఎక్కువ ప్రశ్నలు అప్లికేషన్​ మెథడ్​లో అడుగుతుంటారు. సైకాలజీకి బట్టి విధానం అస్సలు పనికిరాదు.
  • గత టెట్​లను పరిశీలిస్తే పెడగాజి నుంచి 8 నుంచి 10 ప్రశ్నలు, అభ్యసనం నుంచి 6నుంచి 8 ప్రశ్నలు, శిశువికాసం నుంచి 8–10 ప్రశ్నలు , వైయక్తిక భేదాలు, మూర్తిమత్వం టాపిక్​ నుంచి రెండు ప్రశ్నలు అడిగారు. దాదాపు ఇదే తరహాలో ఈ సారి నిర్వహించే టెట్​లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. మెథడాలజీలో తరగతి గది, విద్యార్థి, ఉపాధ్యాయుడు, పాఠశాల పరిసరాలు వీటి చుట్టే ప్రశ్నలు తిప్పి తిప్పి ఎక్కువగా అడుగుతున్నారు. నిత్యజీవితానికి అన్వయించుకుని జవాబులను గుర్తించవచ్చు.
  • లాంగ్వేజ్​ –1 తెలుగు నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. తెలుగు భాష సులభంగా ఉంటుందని భావించి చివరిలో చదవడం, తేలికగా తీసుకోవడం సరైన ధోరణి కాదు. ఎక్కువగా వ్యాకరణ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కవులు, రచనలు, బిరుదులు వంటి కంటెంట్​ అంశాలపై దృష్టి పెట్టాలి. పాఠ్య పుస్తకాల వెనకాల ఉన్న వ్యాకరణ అంశాలను పాఠ్యాంశంలోని విషయాలను అన్వయించుకుని చదవాలి. పద్యాలు, ప్రతిపదార్థాలు, భావం, అర్థాలు, ప్రకృతి–వికృతి, సొంత వ్యాక్యాలు, నానార్థాలు, వ్యతిరేక పదాలు ఇలా ప్రతి అంశం నుంచి గతంలో నిర్వహించిన టెట్​లలో ప్రశ్నలు వచ్చాయి. వీటిపై దృష్టి పెట్టాలి. తెలుగు మెథడాలజీ నుంచి 6 ప్రశ్నలు వస్తాయి. డీఈడీ, బీఈడీ సిలబస్​లోని భాషా బోధనలో అనుసరించాల్సిన వ్యూహాలు, బోధనా పద్ధతులు ఇతర అంశాలను చదవాలి.
  • చాలా మంది అభ్యర్థులకు ఇంగ్లీష్ అంటే భయం ఉంటుంది. ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లీష్​ అనగానే భారంగా ఫీలవుతుంటారు. ఇది మాకు రాదు అనే ధోరణి కనిపిస్తుంది. పరీక్షకు 60 రోజుల సమయం ఉన్నందున ప్రతి రోజు 2 గంటలు ఇంగ్లీష్​ కు తప్పనిసరిగా కేటాయించాలి. గ్రామర్​పై పట్టు సాధిస్తే 15 మార్కులు ఈజీగా స్కోర్​ చేయవచ్చు. తెలియని పదాలను డిక్షనరీ ద్వారా తెలుసుకుంటూ నోట్స్​ రాసుకుంటూ, 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాల్లో ఉన్న గ్రామర్​ను ప్రాక్టీస్​ చేస్తే మార్కులు స్కోర్​ చేయవచ్చు. గత ప్రశ్నాపత్రాలను ఒకసారి గమనిస్తే ప్రశ్నలు ఎలా అడుగుతున్నారనేది అర్ధమవుతుంది. ఇంగ్లీష్ మెథడాలజీ నుంచి 6 ప్రశ్నలు వస్తాయి. ఇవి దాదాపు, డీఈడీ, బీఈడీ సిలబస్​ నుంచే అడుగుతారు.
  • కంటెంట్​ విషయానికి వస్తే ఇది చాలా విస్తృతమైంది. మ్యాథ్స్​, సైన్స్​, సోషల్​ సబ్జెక్టుల నుంచి పేపర్​–1 రాసేవారు 1–8 తరగతుల వరకు, పేపర్​ –2 రాసేవారు 10వ తరగతి సిలబస్​ స్థాయిలో చదవాల్సి ఉంటుంది. సిలబస్​ దాటి ప్రశ్నలు అడిగే అవకాశమే లేదు. కాబట్టి పాఠ్యపుస్తకాలను లైన్​ టు లైన్​ చదువుతూ సొంత నోట్స్​ ప్రిపేర్​ చేసుకుంటే కంటెంట్​లో ఒక్క మార్కు మిస్​ కాదు. కంటెంట్​లో డైరెక్ట్​ క్వశ్చన్స్​ కాకుండా గత టెట్​లలో అప్లికేషన్​ టైపులో ప్రశ్నలు అడిగారు. వీటిని గత ప్రశ్నాపత్రాలు చూస్తే అర్ధమవుతుంది. కంటెంట్​ చదవడం పూర్తయిన తర్వాత మోడల్​ పేపర్స్​ ప్రాక్టీస్​ చేస్తే ఎక్కువ కాలం గుర్తుంటుంది.

(TSTET 2023 డెయిలీ ప్రాక్టీస్​ టెస్ట్ లు merupulu.com అందిస్తుంది. Don’t miss to get good score)

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!