కేజీబీవీ, యూఆర్ఎస్ లలో 1241 పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలను జులై 24, 25, 26 తేదీలలో నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. జిల్లాల వారీగా ఉన్న ఖాళీల వివరాలను ప్రకటించారు.
తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు(KGBV), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్(URS)లలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేజీబీవీ, యూఆర్ఎస్ లలో మొత్తం 1,241 ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. 854 పీజీ సీఆర్టీ, 273 సీఆర్టీ, 77 పీఈటీ, 12 ఎస్ఓ పోస్టులు భర్తీకి చేస్తారు.
రాత పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు. ఈ నెల 26 నుంచి జులై 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. schooledu.telangana.gov.in
లో పూర్తి నోటిఫికేషన్ విడుదల కానుంది.



