జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced 2023) ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలుగు విద్యార్థి వావిలాల చిద్విలాస్ రెడ్డి (నాగర్‌కర్నూల్) టాపర్‌గా నిలవడం విశేషం. అమ్మాయిల కేటగిరీలో నాయకంటి నాగ భవ్యశ్రీ తొలి స్థానంలో నిలిచింది. మొత్తం 43,773 మంది అర్హత సాధించారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. తొలి పది ర్యాంకుల్లో ఆరుగురు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే కావడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేల మంది పరీక్షకు హాజరయ్యారు.
ఈ నెల 4న జరిగిన అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించగా దాదాపు 1.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేల మంది రాశారు. తాజాగా ఫలితాలతో పాటు తుది ‘ఆన్సర్ కీ’ని కూడా ఐఐటీ గువాహటి విడుదల చేసింది. పరీక్షలో కటాఫ్ మార్కులు నిర్ణయించి సుమారు 45 వేల మందిని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్‌కు అర్హత కల్పిస్తారు. పాసైన వారు ఈ నెల 19 నుంచి మొదలయ్యే జోసా కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గతేడాది 23 ఐఐటీల్లో మొత్తం 16,598 సీట్లు అందుబాటులో ఉండగా.. ఈసారి మరికొన్ని పెరిగే అవకాశం ఉంది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఫలితాలు చెక్ చేయాలంటే..ఈ లింక్‌పై క్లిక్ చేయండి https://result23.jeeadv.ac.in/
TOP TEN RANKERS JEE ADVANCED 2023
1. వావిలాల చిద్విలాస్ రెడ్డి
2. రమేశ్ సూర్య తేజ
3. రిషి కర్లా
4. రాఘవ్ గోయల్
5. అడ్డగడ వెంకట శివరామ్
6. ప్రభవ్ ఖండేల్వాల్
7. బిక్కిన అభినవ్ చౌదరి
8. మలయ్ కేడియా
9. నాగిరెడ్డి బాలాజీ రెడ్డి
10. యక్కంటి ఫణి వెంకట మనీందర్ రెడ్డి