తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో మొత్తం 9,231 ఖాళీల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREIRB) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. తాజాగా పరీక్షల తేదీలను ఖరారు చేశారు అధికారులు. గురుకుల ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలను ఆగస్ట్ 01 నుంచి ఆగస్టు 23 తేదీ వరకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అయితే, ఈ పరీక్షల షెడ్యూల్‌ను ఒకట్రెండుల్లో వెల్లడించనున్నట్టు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు కన్వీనర్ డా. మల్లయ్య బట్టు తెలిపారు. ఈ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని చెప్పారు. అక్టోబర్ నాటికి ఫలితాలను విడుదల చేసి.. ఈ విద్యాసంవత్సరంలోనే నియామకాలను పూర్తి చేయాలని బోర్డు భావిస్తోంది. 9వేల పైచీలుకు పోస్టులకు గాను గురుకుల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లను విడివిడిగా విడుదల చేయగా.. 2.63లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు.
గురుకుల అభ్యర్థులకు అలర్ట్.. ఆన్లైన్లోనే నియామక పరీక్షలు.. ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్ అప్టేట్స్ ఇవే!
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS