తెలంగాణలో ఈ నెల 11న గ్రూప్-1 పరీక్షను నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లను పూర్తి చేసంది. తాజాగా హాల్ టికెట్ల విడుదల తేదీని సైతం ప్రకటించింది. అభ్యర్థులు ఈ నెల 4వ తేదీ నుంచి హాల్ టికెట్లను కమిషన్ అధికారిక వెబ్ సైట్లో https://www.tspsc.gov.in/ అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. మొత్తం 503 గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి గడేడాది ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షను గతేడాది అక్టోబర్ 16న నిర్వహించగా.. పేపర్ లీకేజీ నేపథ్యంలో రద్దు చేశారు. అయితే.. ఆ పరీక్ష సమయంలో డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్లు చెల్లవని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులందరూ మళ్లీ నూతన హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఇంకా.. చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా సాధ్యమైనంత ముందుగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని కమిషన్ ప్రకటనలో పేర్కొంది.