ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన తేదీలను మారుస్తూ ఇంటర్ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 4వ తేదీ నుంచి ప్రారంభం కావాలి. అదే రోజున జూన్ 4వ తేదీన జేఈఈ పరీక్షలు ఉండటంతో సప్లిమెంటరీ పరీక్షలను రీషెడ్యూలు చేసినట్లు బోర్డు ప్రకటించింది.
కొత్త షెడ్యూలు ప్రకారం జూన్ 12 వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచిసాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.
INTER ADVANCED SUPPLEMENTARY EXAMS NEW SCHEDULE

Love hffbdhhdr book