భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) తన బెంగళూరు కాంప్లెక్స్ కోసం 428 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది సంస్థ. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.bel-india.in/లో మే 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 428 ఖాళీలుండగా.. ప్రాజెక్ట్ ఇంజనీర్-1 మొత్తం 327, మరియు ట్రైనీ ఇంజనీర్-1కు 101 ఖాళీలు ఉన్నాయి.
BEL రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీ వివరాలు:
ప్రాజెక్ట్ ఇంజనీర్: మొత్తం – 327 పోస్టులు ఉండగా.. ఇందులో.. ఎలక్ట్రానిక్స్ – 164, మెకానికల్ – 106, కంప్యూటర్ సైన్స్ – 47, ఎలక్ట్రికల్ – 07, రసాయన – 01, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ – 02 ఖాళీలు ఉన్నాయి.
ట్రైనీ ఇంజనీర్: ఈ విభాగంలో మొత్తం – 101 ఖాళీలు ఉండగా.. ఇందులో ఎలక్ట్రానిక్స్ – 100, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో మరో 01 ఖాళీ ఉంది.
అర్హతలు: అభ్యర్థులు జనరల్/EWS/OBC అభ్యర్థులకు 55%, అంతకంటే ఎక్కువ మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ/కళాశాల నుంచి సంబంధిత విభాగంలో BE/B.Tech/B.Sc (4-సంవత్సరాల కోర్సు) ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. SC/ST/PwBD అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్ కోసం కనీసం 02 సంవత్సరాల సంబంధిత పారిశ్రామిక పోస్ట్-అర్హత అనుభవం అవసరం. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
వయోపరిమితి: ప్రాజెక్ట్ ఇంజనీర్ కు 32 సంవత్సరాలు; ట్రైనీ ఇంజనీర్ కు 28 సంవత్సరాలు కలిగి ఉండాలి.
వేతనం: ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.30 వేల నుంచి రూ.55 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
ఎంపిక: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు 85 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అదే క్లియర్ చేసిన వారు 15 మార్కులకు ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడతారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ స్థలం బెంగళూరులో మాత్రమే ఉంటుంది. అభ్యర్థులు 1:5 నిష్పత్తిలో మెరిట్ క్రమంలో రాత పరీక్ష మార్కుల (85 మార్కులకు) ఆధారంగా ఇంటర్వ్యూలకు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. ఇంటర్వ్యూ అనంతరం తుది ఎంపిక ఉంటుంది.