బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తిపికబురు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. Gr B (DR)-జనరల్‌లో ఆఫీసర్, Gr B (DR)-DEPRలో ఆఫీసర్, Gr B (DR)-DSIMలో ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 291 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు లక్ష వరకు వేతనం ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 9వ తేదీలోగా ఆన్లైన్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
అర్హతలు:
వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టుల ఆధారంగా డిగ్రీ, పీజీ అర్హత కలిగిన వారు ఆయా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
వయో పరిమితి:
ఆసక్తి గల అభ్యర్థులు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
నెలసరి జీతం:
ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 1,16,914 వరకు వేతనం ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్- rbi.org.in