ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఈ నెల 29న ఖమ్మంలో భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ జాబ్ మేళాలో 100కు పైగా కంపెనీలు పాల్గొంటాయని ఆయన తెలిపారు. ఈ కంపెనీల్లో 10 వేలకు పైగా ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
విద్యార్హతలు: టెన్త్, ఇంటర్, డిప్లొమా, బీ/ఎం.ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీఎస్, పీజీ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ట్రాన్స్ జెండర్లు, చెవిటి, మూగ, దివ్యాంగ అభ్యర్థులకు సైతం అవకాశాలు ఉన్నాయని ప్రకటనలో పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ లింక్–Link

జాబ్ మేళా నిర్వహించు చిరునామా: జాబ్ మేళా వేదిక: SR గార్డెన్స్, వెలుగుమట్ల, ఖమ్మం
Note: అభ్యర్థులు ఇతర వివరాల కోసం 9642333667, 9642333668 నంబర్లను సంప్రదించాలని సూచించారు.