ఏపీలో టెన్త్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఫలితాల విడుదల తర్వాత విద్యార్థులు https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్లో తమ ఫలితాలను చెక్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.

ఏప్రిల్ 18న ఏపీలో టెన్త్ పరీక్షలు పూర్తి అయ్యాయి. ఎగ్జామ్స్ పూర్తయిన 20 రోజుల్లోపే ఫలితాలను విడుదల చేసి రికార్డు సృష్టించేందుకు ఏపీ విద్యాశాఖ సిద్ధం అవుతోంది.