తెలంగాణలో 10వతరగతి, ఇంటర్ పరీక్షలు పూర్తిచేసిన విద్యాశాఖ అధికారులు ఇక ఫలితాలపై దృష్టి సారించారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా చివరి దశకు చేరుకుంది. దీంతో ఫలితాల విడుదలపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంసెట్, నీట్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రవేశ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఇంటర్ వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తిచేసి.. మే ఫస్ట్‌వీక్‌లోనే ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ భావిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే 1, 2 రోజుల్లో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక వేళ ఆలస్యమైతే.. 10వ తేదీలోగా ఫలితాలను విడుదల చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS