ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఇటీవల తెలంగాణలో భారీగా జాబ్ మేళాలు (Telangana Job Mela) నిర్వహిస్తున్నారు. తాజాగా సిరిసిల్ల జిల్లా లో మరో జాబ్ మేళాకు సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ జాబ్ మేళాను ఈ నెల 28న గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లో నిర్వహించనున్నారు.

ఈ జాబ్ మేళాలో విప్రో, టెక్ మహీంద్ర, HDFC బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తో పాటు పలు ప్రైవేటు సంస్థలు పాల్గొని నియామకాలు చేపట్టనున్నాయి. మొత్తం 265 ఖాళీల భర్తీకి ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు.