తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. మొత్తం 1392 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుల్లో తప్పులు సరి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఈ నెల 14వ తేదీ నుంచి 17 వరకు అభ్యర్థులు తప్పులు సరిచేసుకోవచ్చని తెలిపింది. అభ్యర్థులు ఈ ఛాన్స్ ఒక్కసారి మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. అభ్యర్థులు జాగ్రత్తగా తప్పులను సరి చేసుకోవాలని సూచించింది. దీని కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ద్వారా ఆన్ లైన్ లో సవరించుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి పరీక్షను జూన్ లేదా జులై 2023లో నిర్వహించనున్నారు. 27 సబ్జెక్టుల్లో.. మల్టీ జోన్ 1 లో 724, మల్టీ జోన్ 2 లో 668 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS