Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఆ ఉద్యోగ దరఖాస్తులను ప్రారంభించిన టీఎస్పీఎస్సీ.. అప్లికేషన్ లింక్ ఇదే..

ఆ ఉద్యోగ దరఖాస్తులను ప్రారంభించిన టీఎస్పీఎస్సీ.. అప్లికేషన్ లింక్ ఇదే..

డిసెంబర్ 31న తెలంగాణ రవాణ శాఖలోని 113 అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్ (AMVI) ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను తాజాగా ప్రారంభించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 1ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులను https://www.tspsc.gov.in/ వెబ్ సైట్లో సమర్పించాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ప్రాసెస్:
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ను ఓపెన్ చేయాలి.
Step 2: హోం పేజీలో Applications for the Post Of ASSISTANT MOTOR VEHICLES INSPECTOR IN TRANSPORT DEPARTMENT ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో టీఎస్పీఎస్సీ ఐడీతో పాటు.. పుట్టిన తేదీ నమోదు చేయాల్సి ఉంటుంది. నమోదు తర్వాత GET OTP ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీంతో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది.

Step 5: ఆ ఓటీపీని నమోదు చేసిన తర్వాత అప్లికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వ్యక్తిగత వివరాలను సరి చూసుకోవాలి. తర్వాత అర్హతకు సంబంధించి పూర్తి వివరాలను నమోదు చేసి.. సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 6: తర్వాత అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని.. ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాలకు భద్రపరుచుకోవాలి.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!