Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsతెలంగాణ గ్రూప్​ 1 ప్రిలిమ్స్​ రిజల్ట్స్​ 2022

తెలంగాణ గ్రూప్​ 1 ప్రిలిమ్స్​ రిజల్ట్స్​ 2022

తెలంగాణ గ్రూప్‌-1 (TSPSC GROUP 1 RESULTS) ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్​ ఎగ్జామ్ లో వచ్చిన మార్కుల మెరిట్​తో పాటు రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 1 మెయిన్స్​ రాతపరీక్షలకు ఎంపిక చేసింది. మొత్తం 25150 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లుగా ప్రకటించింది. శుక్రవారం రాత్రి టీఎస్​పీఎస్​సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్​ ఫలితాలను విడుదల చేసింది. ప్రిలిమ్స్​ క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ ను అఫిషియల్​ వెబ్​సైట్​లో tspsc.gov.in అందుబాటులో ఉంచింది.

మూడు నెలల తర్వాత టీఎస్‌పీఎస్​సీ ఈ రిజల్ట్ విడుదల చేసింది. రిజర్వేషన్లు, స్థానికతకు సంబంధించి హైకోర్టులో దాఖలైన కేసులతో ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది. రెండు రోజుల కిందట హైకోర్టు క్లియరెన్స్​ రావటంతో ఫలితాల విడుదలకు లైన్​ క్లియర్​ అయింది.

Advertisement

503 గ్రూప్‌ 1 పోస్టులకు అక్టోబర్‌ 16న టీఎస్‌పీఎస్​సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,85,916 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. అదే నెల 29న టీఎస్​పీఎస్​సీ ప్రిలిమినరీ కీ విడుదల చేసింది. అభ్యంతరాలు, నిపుణుల కమిటీ సూచనలతో 5 ప్రశ్నలను తొలిగించి నవంబర్‌ 15న ఫైనల్​ కీ రిలీజ్​ చేసింది.

ప్రిలిమ్స్​ రిజల్ట్ వెలువడటంతో మే నెలలో గ్రూప్​ 1 మెయిన్స్​ పరీక్షలు నిర్వహించే అవకాశముంది. అభ్యర్థుల ప్రిపరేషన్​కు కనీసం మూడు నెలల టైమ్​ ఉండేలా..జూన్ లో మెయిన్స్​ షెడ్యూలు ఉంటుందని టీఎస్​పీఎస్​సీ ప్రకటించింది.
గ్రూప్​ 1 రిజల్ట్స్​ డైరెక్ట్ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి
TSPSC GROUP 1 PRELIMINARY EXAM 2022 RESULTS

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!