తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మొత్తం 1392 జూనియర్ లెక్చరర్ (Junior Lecturer) ఉద్యోగాల భర్తీకి ఇటీవల టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 16వ తేదీన ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో ఆలస్యంగా డిసెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభించింది టీఎస్పీఎస్సీ. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ రోజు అంటే.. జనవరి 10 లాస్ట్ డేట్. వాస్తవానికి దరఖాస్తులు జనవరి 6వ తేదీనే ముగియాల్సి ఉండగా.. దరఖాస్తుల ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభం అవడంతో ఆఖరి తేదీని సైతం పొడిగించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
జూనియర్ లెక్చరర్ జాబ్స్ అప్లికేషన్ డైరెక్ట్ లింక్-LINK
READ THIS: జూనియర్ లెక్చరర్ సిలబస్.. పరీక్షా విధానం
సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
1. అరబిక్ -2
2. బోటనీ-113
3. బోటనీ (UM)-15
4. కెమిస్ట్రీ-15
5. కెమిస్ట్రీ(UM)-15
6. సివిక్స్-56
7. సివిక్స్(UM)-16
8. సివిక్స్ (M/M)-01
9. కామర్స్-50
10. కామర్స్ (UM) -07
11. ఎకనామిక్స్-81
12. ఎకనామిక్స్(UM)-15
13. ఇంగ్లిష్-153
14. ఫ్రెంచ్-02
15.హిందీ-117
16.హిస్టరీ-77
17.హిస్టరీ (UM)-17
18.హిస్టరీ (MM)-01
19.మాథ్స్-154
20.మాథ్స్-(UM) 09
21.ఫిజిక్స్-112
22.ఫిజిక్స్ (UM)-18
23.సంస్కృతం-10
24.తెలుగు-60
25.ఉర్దూ-28
26.జువాలజీ-128
27.జువాలజీ (UM)-18
మొత్తం: 1392

ఉర్దూ మీడియం/మరాఠి మీడియం: టెన్త్ వరకు ఉర్దూ, మరాఠి మీడియంలో చదివిన అభ్యర్థులు లేదా ఉర్దూ/మరాఠిని టెన్త్ లో ఫస్ట్ లాంగ్వేజ్ గా కలిగిన అభ్యర్థులు మరియు ఉర్దూ/మరాఠిని బ్యాచలర్ డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ గా కలిగిన అభ్యర్థులు ఉర్దూ/మరాఠీ మీడియంలో సబ్జెక్టుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సివిక్స్: పొలిటికల్ సైన్స్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో 50 శాతం మార్కులతో పీజీ చేసిన వారు సివిక్స్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.