HomeLATESTతెలంగాణ పాలిసెట్​–2023 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే!

తెలంగాణ పాలిసెట్​–2023 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే!

రాష్ట్రంలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిటెక్నిక్​ కామన్​ ఎంట్రెన్స్​ టెస్ట్​ పాలిసెట్​–2023 (TS POLYCET-2023) నోటిఫికేషన్ ను సాంకేతిక విద్యాశాఖ ఈ రోజు విడుదల చేసింది. పదో తరగతి లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఎగ్జామ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్​ 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. మే 17వ తేదీన పాలిసెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.​ అనంతరం 10 రోజులకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ తెలిపింది.

Advertisement

పాలిసెట్ ద్వారా ఇంజినీరింగ్​/నాన్​ ఇంజినీరింగ్​ సంస్థల్లో పాలిటెక్నిక్​ కళాశాలల్లో డిప్లొమాలో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రొఫెసర్​ జయశంకర్​ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చరల్​ యూనివర్సిటీలోని అగ్రికల్చరల్​, శ్రీ కొండా లక్ష్మణ్​ బాపూజీ తెలంగాణ స్టేట్​ హార్టికల్చరల్​ యూనివర్సిటీలోని హార్టికల్చరల్​, పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలోని యానిమల్​ హస్బెండరీ, ఫిషరీస్​ కోర్సుల్లోనూ పాలిసెట్​ ద్వారా ప్రవేశాలను కల్పించనున్నారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!