ఏపీలో ఇంటర్ పరీక్షలకు (AP Inter Exams) సంబంధించిన షెడ్యూల్ ను ఇంటర్ బోర్డ్ తాజాగా విడుదల చేసింది. మార్చి 15వ తేదీన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంకా సెకండియర్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 3వ తేదీ వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు కొనసాగనున్నాయి. సెకండియర్ పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ ఎగ్జామ్స్ ను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే ప్రాక్టికల్ పరీక్షలు ఈ సారి రాత పరీక్షల తర్వాత నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 15 నుంచి 25వ తేదీ వరకు.. అనంతరం ఏప్రిల్ 30 నుంచి మే 10వ తేదీ వరకు ఈ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటనలో పేర్కొంది. ప్రాక్టికల్ పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.