తెలంగాణ టెట్ (TSTET 2024) అభ్యర్థులు హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకునే డైరెక్టు లింక్ ఇక్కడ అందుబాటులో ఉంది. ఈ లింక్‌ను క్లిక్ చేసి మీ జర్నల్ నెంబర్ పుట్టిన తేదీని నమోదు చేసి హాల్ టికెట్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ నెల 20వ తేదీ నుంచి జూన్ 2 వరకు టెట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా ఆన్ లైన్ లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉదయం, మధ్యాహ్నం, సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల టైమ్ టేబుల్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. హాల్ టికెట్లకు ఈ లింక్ క్లిక్ చేయండి
TSTET 2024 HALL TICKETS DIRECT LINK

ఎగ్జామ్ ప్యాటర్న్: టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు. జనరల్ కేటగిరీలో 90, బీసీలు-75, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే అర్హత పొందొచ్చు. వారే టీఆర్‌టీ రాసేందుకు అర్హులవుతారు. టెట్ మార్కులకు 20 శాతం, టీఆర్‌టీలో వచ్చిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులకు తుది ర్యాంకు నిర్ణయిస్తారు.