తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిని నియామక పరీక్షను ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నియామక పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల 10వ తేదీ నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.

అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి 45 నిమిషాల ముందు వరకు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంకా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కు సంబంధించిన మాక్ టెస్ట్ ను ఈ లింక్ https://www.digialm.com:443//OnlineAssessment/index.html?1222@@M2 ద్వారా రాయొచ్చు.