రేపు గ్రూప్-4 హాల్ టికెట్లను విడుదల చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ తాజాగా ప్రకటన చేసింది. ఈ పరీక్షను జులై 1వ తేదీన నిర్వహించనున్నట్లు ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అభ్యర్థులు రేపటి నుంచి కమిషన్ అధికారిక వెబ్ సైట్ (https://www.tspsc.gov.in/) నుంచి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆఖరి నిమిషం వరకు ఆగకుండా సాధ్యమైనంత ముందుగా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపారు.