తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. కళాశాల విద్యాశాఖ కింద డిగ్రీ కాలేజీల్లో మొత్తం 544 ఉద్యోగాల (Jobs) భర్తీకి డిసెంబరు 31న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ (TSPSC Notification) విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న ప్రారంభం కావాల్సి ఉంది.. కానీ, ఫిబ్రవరి 15కు వాయిదా వేశారు.

తాజాగా మరో సారి దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తెలిపింది. మార్చి 20వ తేదీ నుంచి ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. మే లేదా జూన్‌లో ఇందుకు సంబంధించిన నియామక పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.