తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. మే 2023 సెషన్ కు సంబంధించిన డిపార్ట్మెంట్ టెన్టులను ఈ నెల 15 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. సర్వే&లాంగ్వేజ్ టెస్ట్ ను మినహా మిగతా అన్ని పరీక్షలను CBT విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షలను రాష్ట్రంలోని 9 జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని కమిషన్ సూచించింది. హాల్ టికెట్ల డౌన్ లోడ్ లో ఏమైనా ఇబ్బందులు ఎదరైతే 040-22445566 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు లేటెస్ట్ అప్టేట్స్ కోసం https://www.tspsc.gov.in/వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.