టీఎస్పీఎస్సీలో (TSPSC) పేపర్ లీకేజ్ అంశంలో రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. ఈ నెల 5వ తేదీన జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష (TSPSC AE Exam) పేపర్ లీకైనట్లు పోలీసులు విచారణలో తేలింది. పరీక్షకు రెండు రోజుల ముందే పేపర్ బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. నిందితులను విచారిస్తున్న సమయంలో అసలు విషయం ఇదేనని వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ పరీక్ష ను రద్దు చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనతో ఇటీవల నిర్వహించిన వివిధ నియామక పరీక్షలు.. ముఖ్యంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థుల్లో సైతం ఆందోళన వ్యక్తం అవుతోంది.
మరో టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీక్.. ఎగ్జామ్ రద్దు?
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS