తెలంగాణ స్టేట్ లెవల్ రిక్రూట్మెంట్ బోర్డ్ పోలీసు నియామకాలకు సంబంధించి తుది పరీక్ష తేదీల్లో మార్పులు చేసింది. టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి మేరకు ఈ మార్పులు చేసినట్లు TSLPRB తెలిపింది. ఎస్సై(ఐటీ), ఏఎస్సై( ఫింగర్ ఫ్రింట్స్), కానిస్టేుబుల్, కానిస్టేబుల్(ఐటీ) పరీక్షల తేదీలు మారాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- ఏప్రిల్ 23వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్ష 30వ తేదీ మార్చారు.
- ఎస్సై(ఐటీ విభాగం) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి..
- ఏఎస్సై( ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి..
- కానిస్టేబుల్(ఐటీ విభాగం) పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి..

