తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాలిటెక్నిక్, డీఫార్మసీ కోర్సుల్లో 1990 సంవత్సరం నుంచి ఫెయిలైన వారందకీ మళ్లీ పరీక్ష రాసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
నిర్ణీత ఫీజు చెల్లించిన అభ్యర్థులకు జూన్ లో స్పెషల్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు https://sbtet.telangana.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలని ప్రకటనలో పేర్కొన్నారు.