స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. తాజాగా ఇంటర్ అర్హతతో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 23ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. మొత్తం 1207 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందులో గ్రేడ్-సీ 93 పోస్టులు, గ్రేడ్-డీ 1114 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత ఆగస్టు 24న ఎడిట్ విండో ఓపెన్ అవుతుంది. ఈ ఛాన్స్ ఆగస్టు 25న ముగుస్తుంది.
విద్యార్హతల వివరాలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్ పాసై ఉండాలి. లేదా అందుకు సమానమైన కోర్సు చేసి ఉండాలి. స్టెనోగ్రాఫర్ స్కిల్స్ ఉండాలి.
వయో పరిమితి:
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సీ ఉద్యోగాలకు అభ్యర్థుల వయసు 2023 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డీ పోస్టుకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రేడ్- సీ ఉద్యోగానికి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 ఏళ్లు, విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న మహిళలకు 35 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. గ్రేడ్-డీ గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఇస్తారు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ(జనరల్), పీడబ్ల్యూడీ (ఓబీసీ) 13 ఏళ్లు, పీబ్ల్యూడీ(ఎస్సీ, ఎస్టీ) 15 ఏళ్ల వరకు గరిష్టవయసులో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్:
- అధికారిక పోర్టల్ https://ssc.nic.in/ విజిట్ చేయాలి. హోమ్ పేజీలోని లాగిన్ పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాలి.
- రిజిస్టర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యి, ‘స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సీ, గ్రేడ్-డీ రిక్రూట్‌మెంట్’ లింక్ క్లిక్ చేయాలి.
-సూచించిన వివరాలను ఎంటర్ చేసి అప్లికేషన్ ఫారమ్ నింపాలి. తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. - అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సబ్‌మిట్ చేయాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.
super
nice
Hlo
SSC for stenographer
I want jobs