నీట్ యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. మొత్తం 20,38,596 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాగా.. 11,45,976 మంది అర్హత సాధించినట్లు ప్రకటించింది. తమిళనాడు కు చెందిన ప్రబంజన్, ఏపీకి చెందిన వరుణ్ చక్రవర్తి మొదటి ర్యాంకు సాధించినట్లు NTA తెలిపింది. ఈ ఇద్దరు 720కి గాను.. 720 మార్కులు సాధించినట్లు వెల్లడించారు. విద్యార్థులు https://neet.nta.nic.in/ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
