ప్రముఖ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు అంటే జూన్ 20 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు నవోదయ విద్యాలయ అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారికి రెండు విడతల్లో ఎంపిక పరీక్షను నిర్వహించనున్నారు. నవంబర్ 4న శనివారం ఉదయం 11.30 గంటలకు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో, 2024 జనవరి 20వ తేదీన తెలుగు రాష్ట్రాలతో పాుట దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ అడ్మిషన్ టెస్ట్ ను నిర్వహించనున్నారు.
అర్హత: సంబంధిత విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాలో నివాసం ఉంటూ ఉండాలి. 2023-24 అకాడమిక్ ఇయర్ లో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొంది స్కూళ్లో ఐదో తరగతి చదువుతూ ఉండాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించనున్నారు. విద్యార్థులు మే 1, 2012 నుంచి జులై 31, 2014 మధ్యలో జన్మించి ఉండాలి. అభ్యర్థులు navodaya.gov.in వెబ్ సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.