గ్రూప్-1 సర్వీసుల ప్రధాన పరీక్షల షెడ్యూలును టీజీపీఎస్సీ ప్రకటించింది. 563 పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలు అక్టోబరు 21 నుంచి 27 వరకు జరుగుతాయని వెల్లడించింది. హైదరాబాద్ కేంద్రంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. మెయిన్స్ ఎగ్జామ్స్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగాల్సి ఉంది. ఈ సమయాన్ని టీజీపీఎస్సీ అరగంట ముందుకు జరిపింది. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రధాన పరీక్షల నమూనా జవాబు పత్రాన్ని ఆగస్టు 17 (శనివారం) నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటుంది.
